Swami Narayan Temple : స్వామి నారాయణ్ ఆలయంలో ఘనంగా దీపావళి ఉత్సవాలు

Swami Narayan Temple

Swami Narayan Temple

Swami Narayan Temple : దీపావళిని పండుగను ప్రపంచలోని చాలా దేశాల్లో ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాసాంద్రులు వైభవంగా ఈవెంట్లు, పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతీయ సంప్రదాయాలను, విలువలను ప్రపంచ దేశాలకు చాటుతూ భారత గడ్డ కీర్తిని చాటుతున్నారు.

అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇండియన్స్ కోసం ఆలయాలు నిర్మించుకునేందుకు అనుమతిలివ్వడం, పండుగలను నిర్వహించుకునేందుకు సైతం అనుమతులు ఇస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను ప్రవాస తెలుగు సంస్థలు ఘనంగా నిర్వహించాయి. బతుకమ్మ వేడుకల్లో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రముఖులు పాల్గొని పాడుతూ ఆడడం విదేశాల్లో భారత సంస్కృతి పట్ల గౌరవాన్ని ఇనుమడింప జేసింది.

ఇక  దీపావళిని పురస్కరించుకొని చాలా సంస్థలు ఎన్నో కార్యక్రమాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. సంప్రదాయ సంగీత, డాన్స్ పోటీలు నిర్వహిస్తూ పార్టిసిపెంట్స్ ను అభినందిస్తున్నాయి. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టర్ నగరంలో నిర్మించిన శ్రీ స్వామి నారాయణ్ (అక్షర ధామ్) ఆలయంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం (నవంబర్ 13) రోజున ఆలయ ప్రాంగణంలో బాణాసంచా కాలుస్తూ సందడిగా గడిపారు ప్రవాస భారతీయులు. ఆలయంలో నిర్వహించుకున్న వేడుకలకు సంబంధించి వీడియోలు, ఫొటోల ఇండియాలోని తమ కుటుంబ సభ్యులకు షేర్ చేసుకున్నారు. దీపావళి కాంతులతో ఆలయం మరింత శోభాయమానంగా వెలిగిపోయింది.

దీవాళీ సందర్భంగా మంగళవారం స్వామి వారికి (నవంబర్ 14) ‘అన్నకూట్’ ఏర్పాటు చేశారు. పిండి వంటలు, స్వీట్లు, శాఖాహార భోజనాలను వండి స్వామి వారికి సమర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించి భక్తులకు భోజనం పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by BAPS Houston (@bapshouston)

TAGS