Goats Prevent Wildfires : అడవులు మన పర్యావరణానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అడవులు తగినంత స్థాయిలో లేకపోతే వాతావరణం దెబ్బతింటుంది. అందుకే చెట్లు పెంచాలని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అడవుల రక్షణ చేపట్టడం లేదు. దీంతోనే మనకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతోంది. ప్రముఖ నగరాలకు వరదలు వచ్చే అవకాశాలు ఇందుకే అని తెలిసినా చర్యలు చేపట్టడం లేదు.
అటవీ సంరక్షణకు మనం తీసుకునే చర్యలు కనిపించడం లేదు. దీంతో అడవులు నాశనం అవుతున్నాయి. అమెరికాలో కార్చిచ్చు పుడితే అడవులు లక్షలాది ఎకరాల్లో కాలిపోవడం చూస్తూనే ఉంటుంది. ఇది కాలిఫోర్నియాలో అధికంగా కనిపిస్తుంది. కార్చిచ్చు రేగిందంటే చాలా నష్టం సంభవించడం ఖాయం. అందుకే అడవుల సంరక్షణకు వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
కాలిఫోర్నియాలో అడవుల దహనం కాకుండా ఉండటానికి చోయ్ అనే కంపెనీ 700 మేకలను పోషిస్తుంది మేకలు ఆకులను గడ్డిని తినడం వల్ల అడవుల్లో మంటలు వ్యాపించకుండా నిరోధిస్తాయని నమ్ముతున్నారు. మేకలు తినే ఆకులు, గడ్డి వల్ల మంటలు పుట్టకుండా ఉంటుందని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా దీంతో ఫలితాలు వస్తున్నాయట.
మనుషులు చేయలేని పనిని మేకలు చేస్తున్నాయని విశ్వసిస్తున్నారు. అడవులను మేకలు కూడా రక్షిస్తున్నాయి. ఇలా మేకలు మంటలు రాకుండా చేస్తున్నాయట. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతూ అమెరికా ఇలాంటి రక్షణ చర్యలకు పూనుకుంటోంది. దీంతో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు.