ChatGPT CEO : సంచలనం : చాట్ జీపీటీ సృష్టికర్తను తొలగించిన ఓపెన్ఏఐ కంపెనీ

ChatGPT CEO : ప్రపంచ సాంకేతిక గతిని మార్చేసింది ‘చాట్ జీపీటీ’. ఈ కృత్రిమ మేధ ఎన్నో పనులు చేస్తూ మనిషికి సవాల్ విసిరింది. దీన్ని వల్ల మనిషికే ప్రమాదమని దిగ్గజాలు ఆందోళన చెందారు. అంతలా ఈ కృత్రిమ మేధతో ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించింది. అంతటి చాట్ జీపీటీని సృష్టించిన ఆల్ట్ మన్ పోస్ట్ ఊస్ట్ అయ్యింది. అతడిని ఉద్యోగంలోంచి తొలగించడం పెనుసంచలనమైంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జిపిటిని రూపొందించిన ఓపెన్‌ఎఐ కంపెనీ సిఇఒ సామ్ ఆల్ట్‌మన్‌ను శుక్రవారం తొలగించింది. “ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే అతని సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేదు” అని అది ఒక ప్రకటనలో తెలుపుతూ పక్కనపెట్టింది.

ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరైన ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ( AI) రూపకర్త అయిన సామ్ ఆల్ట్‌మాన్, ఏప్రిల్ 22, 1985న చికాగోలో జన్మించారు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో పెరిగారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ డ్రాపౌట్, అతను ఒక సీరియల్ వ్యవస్థాపకుడు. పెట్టుబడిదారుడుగా మొదట ఉన్నాడు.

గత నవంబర్‌లో ChatGPT చాట్‌బాట్‌ను విడుదల చేసిన OpenAI కంపెనీకి సామ్ సీఈవోగా రూపకర్తగా ఉన్నారు.
ఈయన గతంలో 2011 నుండి 2019 వరకు వై కాంబినేటర్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

19 సంవత్సరాల వయస్సులో సామ్ ఆల్ట్‌మాన్ లొకేషన్ ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ మొబైల్ అప్లికేషన్ అయిన లూప్ట్‌ను సహ-స్థాపించారు. 2014లో రెడ్డిట్‌ సీఈవో యిషాన్‌ వాంగ్‌ వైదొలిగిన తర్వాత ఆయన ఎనిమిది రోజుల పాటు ఆ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ సామ్ ను తొలగించడం సంచలనమైంది.

TAGS