JAISW News Telugu

Bill Gates Into Drainage : డ్రైనేజీలోకి బిల్‌గేట్స్.. అక్కడ ఆయన ఏం చూశాడంటే?

Bill Gates Into Drainage

Bill Gates Into Drainage

Bill Gates Into Drainage : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ గురించి ప్రపంచానికే పరిచయం అవసరం లేదు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ ను ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు. దీంతో ప్రపంచ స్థితి గతులు మారాయి. సరే.. ఇవన్నీ పక్కన పెడితే ఆయన సేవా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి. గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కోట్లాడి రూపాయలను సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు.

ఆయితే ఆయన ఇటీవల డ్రైనేజీలోకి దిగాడు. ఈ వీడియో ఇప్పుడు అటు టెక్, ఇటు సోషల్ మీడియాను అతలాకుతలం చేస్తుంది. అసలు ఆయన డ్రైనేజీ (సివరేజ్)లోకి ఎందుకు వెళ్లారని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా బ్రస్సెల్స్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తెలుసుకునేందుకు వెళ్లాడు.  ‘నేను ఈ సంవత్సరం #WorldToiletDay కోసం బ్రస్సెల్స్ మురుగునీటి వ్యవస్థ చరిత్రను ప్రపంచ ఆరోగ్యంలో మురుగునీటి పాత్రను అన్వేషించాను’ అని బిల్ గేట్స్ ఇన్‌ స్టాలో రాశారు.

‘నేను బ్రస్సెల్స్ భూగర్భ మ్యూజియంలో ఇవన్నీ అనుభవించాను. నగరం మురుగునీటి వ్యవస్థ చరిత్రను డాక్యుమెంట్ చేస్తున్నాను. 1800లో మురుగునీరు నగరంలోని సెన్నె నదిలోకి డంప్ చేయబడింది. అది భయంకరమైన కలరా మహమ్మారికి దారితీసింది. నేడు, 200-మైళ్ల మురుగు కాలువలు మరియు ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నెట్‌వర్క్ నగరం వ్యర్థాలను ప్రాసెస్ చేస్తుంది.’ అని చెప్పారు.

ప్రపంచ టాయిలెట్ డే గురించి మరింత:
ప్రతి సంవత్సరం, వరల్డ్ టాయిలెట్ డే నవంబర్ 19 న జరుపుకుంటారు. ఈ రోజును సింగపూర్ కు చెందిన జాక్ సిమ్ సంస్థ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ 2001లో వరల్డ్ టాయిలెట్ డేగా నవంబర్ 19ని గుర్తించింది. పబ్లిక్ ఔట్రీచ్, ఔచిత్యం మరియు కమ్యూనికేషన్ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశపూర్వకంగా పరిశుభ్రతపై టాయిలెట్ అనే పదాన్ని ఎంచుకున్నారు.

Exit mobile version