UAE Golden Visa: UAE గోల్డెన్ వీసాతో ఎన్నో లాభాలు.. అవేంటంటే?

UAE Golden Visa: తమ దేశానికి వివిధ రంగాల్లో సేవలు చేసే వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ‘గోల్డెన్ వీసా’ అందజేస్తుంది. ఈ వీసా దీర్ఘకాలికంగా అక్కడ ఉండేందుకు వీలు కల్పిస్తుంది. ఈ వీసాతో లాంగ్ టర్మ్ లో 10 సంవత్సరాలు, షార్ట్ పీరియడ్ లో 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. దీని తర్వాత అటో మెటిక్ గా వీసాను మళ్లీ పునరుద్దరిస్తారు. 2019లో యూఏఈ ఈ వీసా విధి విధనాల కోసం ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసింది. వంద శాతం ఓనర్‌షిప్‌తో వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ వీసాతో 8 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

దీర్ఘకాలిక, పునరుత్పాదక నివాసం
ఈ వీసా కలిగి ఉన్న వారు 10 సంవత్సరాల పాటు యూఏఈలో నివసించవచ్చు. ఈ వీసా కోసం మొదట దరఖాస్తు చేసుకున్న కేటగిరికి సంబంధించిన అర్హతా ప్రమాణాలను పూర్తి చేసి నంత కాలం వీసాను పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తుంది.

యజమాని అవసరం లేదు
యూఏఈలో నివాసించాలంటే స్పాన్సర్ వీసా అవసరం. మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ, ఆ దేశంలో మీకు ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు. అయితే, యూఏఈ వీసా వ్యవస్థలో కొన్ని మార్పులను చేశారు. అందులో ముఖ్యంగా గోల్డెన్ వీసాలో మార్పులను పరిశీలిస్తే.. గోల్డెన్ వీసా ఉంటే చాలు ఉద్యోగాలు మరింత సులభంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మునుపటి యజమాని స్పాన్సర్ చేసిన నివాస వీసాను రద్దు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి.

ఎక్కువ కాలం బయటే ఉన్నా రద్దు కాదు..
సాధారణంగా ఎక్కువ రోజులు దేశం విడిచి ఉంటే వీసా రద్దవుతుంది. దీంతో రెన్యువల్ చేసుకోవాలి. అయితే గోల్డెన్ వీసా అలాకాదు. ఆరు నెలల వరకు కాలపరిమితిని ఇస్తుంది. ఆలోపు దేశానికి వచ్చి వెళ్తే.. ఆరు నెలలు మళ్లీ రెన్యువల్ అవుతాయి.

కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేసేందుకు..
కొత్త వీసా విధానంలో ప్రవాసులు 25 సంవత్సరాల్లోపు మగ పిల్లలను స్పాన్సర్ చేసేందుకు అనుమతిస్తుంది. కానీ, గోల్డెన్ వీసా దారులైతే పదేళ్ల రెసిడెన్సీని కలిగి ఉండడం వల్ల కొన్నేళ్లకోసారి రెసిడెన్సీని రెన్యువల్ చేయకుండా నివారించవచ్చు. ఈ వీసా వ్యవస్థ ప్రాయోజిక కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసా ప్రాథమిక హోల్డర్ మరణిస్తే..
ప్రాయోజిత సభ్యుల అనుమతి చెల్లుబాటవుతుందని హామీ ఇస్తుంది.

మీరు స్పాన్సర్ చేసే కార్మికులపై ఎలాంటి పరిమితి ఉండదు
గోల్డెన్ వీసాపై ఎంత మంది గృహ సహాయకులనైనా స్పాన్సర్ చేయవచ్చు. అందుకు దీనిలో సవరణలు చేసింది అక్కడి ప్రభుత్వం.

దరఖాస్తుదారుల కోసం..
గోల్డెన్ వీసా లేకుంటే.. దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఆరు నెలల బహుళ-ప్రవేశ విజిట్ వీసా ఉంటుంది. ఇది యూఏఈకి వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు పేపర్ వర్క్ పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
వారు వారి దేశానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు గోల్డెన్ వీసా హోల్డర్ అయితే నేరుగా యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ దేశానికి చెందిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ లో దరఖాస్తు చేసుకునే వెసులు బాటును గోల్డెన్ వీసా కల్పిస్తుంది. అక్కడి డ్రైవింగ్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైతే
మీరు లైసెన్స్‌ పొందవచ్చు.

ప్రత్యేకమైన ప్యాకేజీలు
దుబాయ్, అబుదాబిలో ఫుల్ టైమ్ ఉద్యోగులు గోల్డెన్ వీసా దారులైతే వారి యజమానికి సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీ పరిధిలోనికి వస్తారు. (విదేశాల్లో ఉండే పెట్టుబడి దారులు, ఫ్రీ లాన్సర్లు, వారి సొంత ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండాలి). దీనిలో భాగంగా అక్కడి నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఒక ప్రత్యేక బీమా ప్లాన్‌ ఉంది.
ఈ ప్యాకేజీకి ప్రీమియం 2,393 దిరామ్స్ (రూ.54 వేలు) నుంచి ప్రారంభం కావచ్చు. వార్షిక కవరేజ్ పరిమితి 3 లక్షల దిరామ్స్ (రూ.67.97లక్షలు).

TAGS