BATA Diwali celebrations : బే ఏరియాలో బాటా ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
BATA Diwali celebrations: ఖండాలు దాటినా మన ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదు. అమెరికా వెళ్లినా అంటార్కిటికా వెళ్లినా మనదేశ పద్ధతులు పాటించడం బాగుంటుంది. విదేశాల్లో ఉన్నా విజ్ణానం ఎంత పెరిగినా మన పండగ విధానాలు మరవద్దు. ఈనేపథ్యంలో అమెరికాలో మన తెలుగువారు అత్యంత వైభవంగా దీపావళి సంబరాలు జరుపుకుంటారు.
కాలిఫోర్నియాలోని మిల్చిటాస్ లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాటా ప్లాగ్ షిప్ ఈవెంట్ లో ఒకటైన దీపావళి సంబరాలు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రచారం పొందింది. ఈ కార్యక్రమానికి స్థానిక సంఘాల నుంచి మద్దతు లభించింది. దీపావళి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.
బాలీవుడ్ గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్ లైవ్ కాన్సార్ట్ ప్రేక్షకులను మైమరపించింది. దీనికి సంజయ్ ట్యాక్స్ ప్రో అసోసియేట్ రియల్టర్ నాగరాజు స్పాన్సర్లుగా వ్యవహరించారు. గ్రాండ్ స్పాన్సర్ గా ఏవీఆర్ చౌదరి, గోల్డ్ స్పాన్సర్ గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్లుగా పీఎన్జీ జువెల్లర్స్, టీఈఎస్ క్యూఏ ఏఐ మరియు వీవైజడ్ ఎన్ రియల్టీ వ్యవహరించాయి. దీనికి పాఠశాల, హరివిల్లు రేడియో సహకారం అందజేశాయి.
150 మందికి పైగా పిల్లలు డాన్సులతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బాటా అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపరు. శివ, కాదా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీని పరిచయం చేశారు. శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, సందీప్, కేదారిశెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజు ఆహుతులుగా విచ్చేశారు. బాటా బోర్డు సభ్యులు జయరామ్ కోమటి, విజయ్ ఆసూరి, వీరు పప్పుల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కల్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలియజేశారు.