Alai Balay: ‘మాట’ ఆధ్వర్యంలో అలయ్ బలయ్.. ఫుజ్ జోష్ లో ప్రవాస భారతీయులు
Alai Balay: మన అమెరికన్ తెలుగు అసోసియేష్ ‘మాట’ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ అలరించింది. టెక్సాస్ లోని డ్రీమ్ డెస్టినేషన్ రాంచ్ వేదికగా ‘డల్లాస్ చాప్టర్ దసరా అలయ్ బలయ్’ సంబురాల్లో 3 వేలకు పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ‘మాట’ డల్లాస్ చాప్టర్ రాజ్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇందులో ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రావణ దహనం కీలక ఘట్టంగా జరిగింది. ప్రవాస భారతీయులు కేరింతలు కొడుతూ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో ‘మాట’ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గనగోని, బీజేపీ లీడర్ ప్రదీప్ రవికాంత్ చీఫ్ గెస్ట్ లుగా హాజరై మాట్లాడారు. ప్రముఖులను సత్కరించి సన్మానాలు చేశారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, కోలాటాలతో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళల ఆట, పాటలు, కోలాటాలతో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సింగర్స్ శ్రీకాంత్, స్ఫూర్తి తమ గాత్రం అందించారు. వారి పాటలకు హాల్ లో జోష్ పెరిగింది. కార్యక్రమం అనంతరం వింధు నిర్వహించారు.
ఈ కార్యక్రమం జయప్రదం కావడంతో ‘మాట’ డల్లాస్ చాప్టర్ ఆనందం వ్యక్తం చేసింది. సేవా, సంస్కృతి, సమానత్వం అనే ప్రధాన సూత్రాలపై ‘మాట’ కొనసాగుతుందని సభ్యులు వివరించారు. అలయ్ బలయ్ విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు, మాటకు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మాట సభ్యులు చెప్పారు.