TTD : శ్రీవారి క్యూలైన్ లో యూట్యూబర్ ప్రాంక్ వీడియో.. టీటీడీ ఆగ్రహం

TTD

TTD

TTD : తిరుమల ఆలయంలో ఓ యూట్యూబర్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చిత్రించిన  వీడియో టీటీడీకి ఆగ్రహం కలిగించింది. అలాంటి వీడియోలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ‘హీనమైన’ చర్యగా పేర్కొంది. శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్ లో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా యూట్యూబర్ వీడియో చేయడంపై టీటీడీ ఉపక్రమించింది.

యూట్యూబర్ కంపార్ట్ మెంట్ తాళాలు తీసి యాత్రికులను దర్శనానికి వదులుతున్నట్లు టీటీడీ ఉద్యోగిలాగా ప్రాంక్ వీడియో చేశాడు. కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్న భక్తులు తమ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తాడనుకొని అంతా ఒక్కసారిగా లేచి, అటువైపు వెళ్లబోయారు. ఈ క్రమంలోనే అతడు వెకిలిగా నవ్వుతూ పరుగుతీశాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో తమిళనాడులో వైరల్ అయింది. దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ స్పందించింది. యూట్యూబర్, అతనికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని తమిళనాడుకు పంపినట్లు సమాచారం.

TAGS