JAISW News Telugu

Suicide: ఆర్టీసీ బస్సులో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

Suicide: ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాళహస్తి-తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. రేణిగుంట వద్ద బస్సులో వెనుక సీటు వద్ద ఉనక్న హ్యాంగర్ కు యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కండక్టర్ గుర్తించారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని, యువకుడి వివరాలు సేకరిస్తున్నారు.

Exit mobile version