JAISW News Telugu

Annamayya: గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు

FacebookXLinkedinWhatsapp

Annamayya: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే మైకుల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, వైసీపీకి చెందిన పాటలు వేయడంపై బి.కొత్తపేటలో పోలీసులు కేసు నమోదు చేశారు. గణేశ్ నిమజ్జనం ఊరేగింపు సమయంలో బస్టాండ్ వద్దకు చేరుకోగానే వైసీపీ జెండాలతో పలువురు నేతలు నానా హంగామా చేశారు. అధికార టీడీపీని అవమానించే విధంగా నీకు 15 వేలు, నీకు 10 వేలు అంటూ మీమ్స్ ప్లే చేశారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది.

వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో నిబంధనలకు విరుద్ధంగా పాటలు పెట్టి రెచ్చగొట్టారని నిర్ధారించిన పోలీసులు నిమజ్జన కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసకుంటామని వెల్లడించారు.

Exit mobile version