Hunter Survey Report : భారత్ నుంచి పెరిగిన మహిళా కార్మికులు.. సంచలన విషయాలు వెల్లడించిన ‘హంటర్’..

Hunter Survey Report

Hunter Survey Report

Hunter Survey Report : భారత్ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా వినిపించే పేరు. 2014 నుంచి బీజేపీ పాలనలో మోడీ నాయకత్వంలో దేశం దూసుకెళ్తుందని ప్రపంచం చెప్తూనే ఉంది. దీనికి తోడు ‘మోడీ ఈజ్ ద బాస్’ అంటూ ప్రపంచ వేదికలపై భారత ప్రధాని మోడీకి గౌరవం దక్కుతూనే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎకానమీలో భారత్ ప్రపంచంలో 5వ స్థానం దక్కించుకుంది. కరోనా తర్వాత గ్రేట్ బ్రిటన్ ను వెనక్కు నెట్టి ముందుకు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ గురించి అనేకం ఉన్నాయి.

కరోనా కాలంలో ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చింది భారత్. కానీ ఇప్పుడు హంటర్ నివేదిక సంచలన విషయాలు చెప్పింది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న దేశాల లిస్ట్ లో భారత్ ఫస్ట్ ప్లేస్ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలు భారత్ లో తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. కానీ ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే మహిళా కార్మికుల సంఖ్య పెరుగుతుంది.

ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ హంటర్ తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. గల్ఫ్ దేశాలకు వెళ్లే మహిళా కార్మికుల సంఖ్య పెరిగిందట. అయితే గతంలో గల్ఫ్ కు వెళ్లే భారతీయ కార్మికుల్లో కేరళ రాష్ట్రం మొదటి ప్లేస్ లో ఉండేదట. ఇప్పుడు ఆ స్థానాన్ని ఉత్తర ప్రదేశ్, బిహార్ ఆక్రమించాయని నివేదిక పేర్కొంది. గల్ఫ్ దేశాలకు కార్మికులుగా వెళ్లే వారి సంఖ్యలో ఫస్ట్ ప్లేస్ యూపీ, 2. బిహార్, 3. కేరళ, 4. పశ్చిమబెంగాల్, 5. తమిళనాడు ఉన్నాయి.

ఇందులో 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారే అధికమని నివేదిక పేర్కొంది. సాధారణంగా వలస కార్మికుల్లో పురుషులే ఎక్కువగా ఉంటారు. కానీ ఇటీవల మహిళా కార్మికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఆతిథ్య రంగంలో సంఖ్య ఎక్కువైందని నివేదిక పేర్కొంది.

TAGS