Vemulawada Temple : ఆలయం హుండీ తెరిచిన అధికారులు షాక్ అయ్యారు.. ఎందుకంటే?

Vemulawada Temple : దక్షిణ కాశీగా గుర్తింపు సంపాదించుకున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. 38 రోజుల తర్వాత రాజన్న ఆలయ హుండీని తెరిచిన అధికారులు షాక్ కు గురయ్యారు.

స్వామి వారి హుండీ ఆదాయం 38 రోజులకు  రూ. కోటి 88లక్షల, 69వేల 697 సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. స్వామివారికి భక్తజనం కానుకల రూపంలో బంగారం 360 గ్రాముల 100 మిల్లీ గ్రాములు, వెండి 14 కిలోలు, 150 గ్రాములు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి వెల్లడించారు.

లెక్కింపునకు ముందుగా ఆలయ ఉన్నతాధికారులు ఎస్పీఎఫ్, పోలీస్ సిబ్బంది, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు సిబ్బందిని తనిఖీలు చేసి.. లెక్కింపు నిర్వహించే హాల్ లోకి అనుమతిస్తారు. గతంతో పోలిస్తే చాలావరకు స్వామివారి ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా సేవకు బుక్ చేసుకున్న వారితోనే ఆదాయాన్ని లెక్కిస్తారు. ఇలా స్వామి వారి సేవలో పాల్గొన్నందుకు అయ్వవారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందిస్తారు. చాలా మంది భక్తులు స్వామి ఆలయ సేవలో పాల్గొనడం సౌభాగ్యంగా భావిస్తారు.

హుండీ ఆదాయం లెక్కింపులో కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షణలో ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు శ్రీలలితా సేవా సమితి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామి వారికి అధిక మొత్తం కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం తెలిసిందే.

రోజూ వేల సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటారు. శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకొని స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులను సమర్పించి సేవలో తరిస్తారు. సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్, పోలీసుల నిఘాలో లెక్కింపును ఆలయ అధికారులు విజయవంతనగా నిర్వహించారు.

TAGS