JAISW News Telugu

Warangal: ట్రైన్ పైకెక్కి రీల్స్.. విద్యుత్ షాక్ తో యువకుడు ఆస్పత్రిపాలు

FacebookXLinkedinWhatsapp

Warangal: సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఎవరు ఎంతగా హెచ్చరించినా రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాలు కోల్పోతున్నా ఈ పిచ్చిని వదలడం లేదు. రాజ్ కుమార్ అనే యువకుడు రీల్స్ చేసేందుకు వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో నిలిపి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతడి శరీరం దాదాపు 70 శాతం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

Exit mobile version