Students schems : విద్యార్థులకు ఇది మంచి వార్త.. ఇలాంటి ఛాన్స్ మిస్ కావద్దు..
Students schems : అటు కేంద్రం, ఇటు రాష్ట్రం విద్యార్థుల కోసం ఎన్నో పథకాలను తీసుకచ్చింది. వీటిలో ఆర్థిక తోడ్పాటు అందించేవే ఎక్కువగా ఉన్నాయి. పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు స్కాలర్ పిప్పులకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కేంద్రం కూడా ఏటా విద్యార్థులకు జాతీయ స్కాలర్ షిప్పులను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ ను పొందాలంటే నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(ఎన్ఎస్‌పీ)లో దరఖాస్తు చేసుకోవాలి. కొద్ది రోజుల క్రితం ఎన్ఎస్‌పీ-2024 స్కాలర్ షిప్పునకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది ఇంటర్ పాసవుట్ విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీ వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
గతంలో దరఖాస్తు చేసుకున్న వారు 2024-25 విద్యాసంవత్సరం కోసం రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. నవంబర్ 15వ తేదీలోగా నోడల్ అధికారి వెరిఫికేషన్ చేస్తారని ఇంటర్ బోర్డు వెల్లడించింది. దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థులు https://scholarships.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.
ఈ వెబ్ సైట్ లో స్టూడెంట్ అనే ఆప్షన్ కు వెళ్లాలి. ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్ షిప్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి విద్యార్థుల వివరాలను ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ, పాస్ వర్డ్ సాయంతో స్కాలర్ షిప్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అందులో వివరాలను పూర్తిగా నమోదు చేసి.. దరఖాస్తును సమర్పించాలి. ఎన్ఎస్‌పీ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు.. బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్, అడ్రెస్ ప్రూఫ్, మెమోరాండం అండ్ పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటు విద్యార్థి భారతీయ పౌరుడై ఉండాలి.
దరఖాస్తుు చేసుకున్న విద్యార్థి గత తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించి ఉండకూడదు.