toothbrush : బాలుడి దవడలో చొచ్చుకుపోయిన టూత్ బ్రష్.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

toothbrush

toothbrush

toothbrush : శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో పళ్లు తోముతున్న బాలుడి దవడలో టూత్ బ్రష్ గుచ్చుకుంది. బాలుడు బ్రష్ చేస్తుండగా ఒక్కసారిగా కింద పడడంతో టూత్ బ్రష్ దవడలోకి చొచ్చుకుపోయింది. దీంతో బాలుడు విలవిలలాడాడు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి బ్రష్ ను తొలగించారు. ప్రస్తుతం బాలుడు ప్రవీణ్ కుమార్ (11) ఆరోగ్యం నిలకడగా ఉందని, బ్రష్ చేసేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

TAGS