- ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్
విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను శాంతింపజేశారు. అసలు టీచర్ ఇలా స్టూడెంట్స్ జుట్టు కట్ చేయడం వెనక గల కారణమేంటి అనేదాని గురించి విభిన్న మైన వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నీటుగా ఉండాలని జుట్టు పెంచుకొని స్టైల్ కటింగ్ చేసుకొని వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిందని అయినా చెప్పినా వినకుండా విద్యార్థులు అలా చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అలా చేయాల్సి వచ్చిందని కొంతమంది అంటున్నారు.
కాగా ఆమె క్లాస్ రూమ్ లో జుట్టు కత్తిరిస్తున్న సమయంలో హెచ్ఎం అక్కడికి వెళ్ళగా ఆమెని బెదిరించి నిలుపుదల చేయించినట్లు సమాచారం. ఇంగ్లీష్ టీచర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్ఎం హామీ ఇవ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కాస్త శాంతించారు. ఏదైనా విషయం ఉంటే మాతో చర్చించాలి గానీ ఇష్టా రీతిన తమ పిల్లల జుట్టు కత్తిరించడానికి టీచర్ ఎవరు అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. టీచర్ అనూష తీరు ఏమాత్రం బాగోలేదని విమర్శలు చేశారు.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఇంత స్ట్రిక్ట్ గా ఉండడం ఇప్పటివరకు చూడలేదు. అని చాలామంది నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తుండగా ఇదేం పిచ్చి అలా చేయొచ్చా అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై ఇలా చేయడం సరికాదని కొంతమంది ఆమె తీరును నిరసిస్తున్నారు.