JAISW News Telugu

Terrorist Attack : ఉగ్రవాదుల దాడి.. 8 మంది పాక్ సైనికులు మృతి

Terrorist Attack

Terrorist Attack

Terrorist Attack : పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ కు 330 కి.మీ.ల దూరంలో ఉన్న లోని ఖైబర్ పక్తుంఖ్వాలోని బన్నూ మిలటరీ కంటోన్మెంట్ పై నిన్న (సోమవారం) తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్ పిఆర్) మంగళవారం (జులై 16) ప్రకటించింది. ఈ ఘటనలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి.

సోమవారం (జులై 15) తెల్లవారుజామున అత్యాధునిక ఆయుధాలు, ఆత్మాహుతి చొక్కాలు ధరించిన ఉగ్రవాదులు బన్నూ కంటోన్మెంట్ పై దాడిచేశారు. లోపలికి ప్రవేశించడం సాధ్యంకాకపోవడంతో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో కంటోన్మెంట్ గోడలను ఢీకొట్టారు. అదే సమయంలో చెక్ పాయింట్్ వద్ద మరో వాహనాన్ని పేల్చివేశారు. దీంతో భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం లోపలికి చొచ్చుకెళ్లిన ఉగ్రవాదులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది సైనికులు, మరో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై స్పష్టత లేదు.

అయితే, దాడి జరిగిన ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం భారీగా మోహరించింది. ఈ దాడిలో ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రమేయం ఉందని పాక్ సైన్యం ఆరోపించింది.

Exit mobile version