Mattapalli temple : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడం, అదనంగా వరద నీరు వచ్చి చేరడం వంటి కారణాలతో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుని ఆలయలోకి ఊటనీరు ఉబికి వస్తోంది. సంవత్సరంలో మూడు, నాలుగు నెలలు ఆలయ ప్రాంగణం మొత్తం నీటితో ఉంటోంది. భక్తులు ఆ నీటిలోనే నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఆలయం ముంపునకు గురి కాకుండా ఏర్పాటు చేసిన సీసీ గోడకు పలు చోట్ల రంధ్రాలు పడి కల్యాణ కట్ట అడుగు భాగంలో ఊటనీరు వస్తోంది. నాలుగు విద్యుత్ మోటార్లతో నీటిని తోడెస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రాజెక్టు ఏపీ జలవనరుల శాఖ పరిధిలో ఉండడంతో సీసీ గోడకు మరమ్మతులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంబంధిత అధికారులను కలిసి పరిస్థితి వివరించినా ప్రయోజనం కలుగడం లేదని ధర్మకర్తు చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు తెలిపారు.