Mahanandi Awards 2023-24 : గొడిశాల మంజుల రాణికి మహానంది పురస్కారం

Mahanandi Awards 2023-24 Winner Godishala Majula
Mahanandi Awards 2023-24 : తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ మహానంది పురస్కారాలు 2023 -24 వేడుకలు రవీంద్ర భారతి (హైదరాబాద్) వేదికగా ఇటీవల నిర్వహించారు. మ్యారేజ్ బ్యూరోలో విశిష్ట సేవలు అందించిన వారికి మహానంది పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందులో భాగంగా నర్సంపేట పట్టణానికి చెందిన సాయి కృష్ణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ గొడిశాల మంజుల రాణి గౌడ్ శ్రీ మహానంది పురస్కారానికి ఎంపికయ్యారు.
మంజుల రాణి శ్రీ కళ్యాణ బంధం మ్యాట్రిమోనీ వరంగల్ అర్బన్ -రూరల్ అనుబంధ సంస్థలతో కలిసి వివిధ కులాలకు సంబంధించిన వారికి వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి నూతన వధూవరులుగా సంబంధం కుదిరించడంలో తనవంతు కృషి చేశారు. ఈమేరకు ఆమెను మహానంది పురస్కార ప్రధానంతో బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, విశిష్ట అతిథుల సమక్షంలో ఘనంగా సత్కరించారు.