PM Modi: సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనల స్ఫూర్తితోనే ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ కార్యక్రమాని్న అమలు చేస్తున్నామని పీఎం నరేంద్ర మోదీ తెలిపారు. బాబా జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్యసాయి మందిరానికి లేఖ పంపారు. ‘‘సత్యసాయిబాబా మానవాళికి ప్రేమ, అనురాగాలు పంచి, మానవసేవయే మాధవసేవ అని చాటారు. అందరినీ ప్రేమించు-అందరనీ సేవించు, తోటి మానవుడికి సహాయం అందించు అంటూ తన బోధనల ద్వారా ప్రజలను సేవ వైపు నడిపించారు. విద్య, వైద్యాన్ని పేదల చెంతకు చేర్చారు. సత్యసాయి సేవ, ప్రేమ, అనురాగాన్ని ప్రత్యక్షంగా చూశాను. గుజరాత్ లో భూకంప బాధితులకు అండగా నిలిచారర’ అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.