JAISW News Telugu

Rains in Telangana : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Rains in Telangana

Rains in Telangana

Rains in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు (శనివారం) జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

అదేవిధంగా ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శుక్రవారం పశ్చిమ-మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద ఎగువ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ. మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.

Exit mobile version