Rahul Gandhi : రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 2023 లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణ కోర్టు పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇందుకు ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేయగా, గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (ఎఫ్ఎంఎఫ్ సి) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే శుక్రవారం విచారించిన కోర్టు విచారణకుహాజరు కావాలంటూ రాహుల్ గాంధీని ఆదేశించింది.