PHC doctors : ఏపీలో సమ్మె విరమించిన పీహెచ్ సీ వైద్యులు
PHC doctors : ఏపీలో పీహెచ్ సీ వైద్యుల అసోసియేషన్ సమ్మె విరమించింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించి విధుల్లో చేరాలని వైద్యులు నిర్ణయించారు. జీవో 85 వెనక్కు తీసుకోవడంతో పాటు పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం నుంచి హామీ రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలలో ఉన్న వైద్యులకు రావాల్సిన పీజీ సీట్లను జీవో 85 దూరం చేస్తోందని గత కొన్ని రోజులుగా పీహెచ్ సీ వైద్యులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.