JAISW News Telugu

Kaleshwaram Project: ‘కాళేశ్వరం’ లేకున్నా వరి దిగుబడి పెరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

Kaleshwaram Project: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. దీంతో కాళేశ్వరం వల్లే వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ ప్రచారం పటాపంచలైందని పేర్కొన్నారు. అత్యధిక దిగుబడి ఘనత సాధించేందుకు కారణమైన ప్రతి రైతుకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Exit mobile version