Payal ghosh:ఎన్టీఆర్‌పై MeeToo బ్యూటీ ఊహించని కామెంట్
Payal ghosh:పాయల్ ఘోష్.. పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులోను నటించింది. మీటూ ఉద్యమంలో ఈ భామ పేరు మార్మోగింది. ఇండస్ట్రీపై ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ ఎక్కువని, బాలీవుడ్ తో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీ బెటర్ అంటూ ఈ అమ్మడు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోలేదు. తెలుగులో పాయల్ ఘోష్ మొదటి సినిమా ప్రయాణం. ఆ తర్వాత మిస్టర్ రాస్కల్ సినిమాలో కూడా చేసింది. అయితే ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఊసరవెల్లి సినిమాలో కూడా పాయల్ ఘోష్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్.. తాను ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. `ఒకరోజు థాయ్‌లాండ్‌లో ఊసరవెల్లి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రోడ్డుపై బట్టలు మార్చుకున్నాను. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ నన్ను చాలా కోపంగా తిట్టాడు. నిజమైన దక్షిణ భారతీయుడికి మహిళల పట్ల చాలా గౌరవం ఉంటుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ నన్ను అలా తిట్టాడు` అని చెప్పింది.
ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. తారక్ అభిమానులు `మా హీరో ఎప్పుడూ మహిళలను చాలా గౌరవిస్తాడు` అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆడవారి ఆత్మాభిమానాన్ని కాపాడటం పురుష లక్షణం. దక్షిణాది హీరోలకు ఇది ఉంది అని నెటిజనులు పాయల్ మాటకు మద్ధతుగా నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ ఘోష్ మీటూ ఉద్యమ సమయంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై తీవ్రంగా ఆరోపించింది. అతడు తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.