Shah rukh:షారుక్‌తో పాటు ఎన్టీఆర్-రాజమౌళికి అంతర్జాతీయ గౌరవం
Shah rukh:RRR కొందరి జాతకాల్ని మార్చేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు అంతర్జాతీయంగా మార్మోగిపోవడానికి ఈ సినిమా సాధించిన అసాధారణ విజయం ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును భారతదేశానికి అందించిన ఘనత ఈ సినిమాకి దక్కింది. ముఖ్యంగా ఆర్.ఆర్. ఆర్ నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా వేవ్స్ క్రియేట్ చేసింది. అమెరికా బ్రిటన్ వాసులకు ఈ పాట ఎంతో గొప్పగా నచ్చింది. అంతేకాదు ప్రఖ్యాత హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్ని ఆర్.ఆర్.ఆర్ అందుకుంది.
ఇప్పుడు మరో అరుదైన గౌరవం రాజమౌళి- ఎన్టీఆర్ కి దక్కింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో సంచలనాలు సృష్టించిన రాజమౌళి, తనదైన ప్రతిభ సూపర్ స్టార్ డమ్‌తో ఎలాంటి పాత్రలోకి అయినా ఒదిగిపోయే స్టార్ ఎన్టీఆర్ లను కీర్తిస్తూ ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఒక కథనం ప్రచురించింది. రాజమైళిని గొప్ప కమర్షియల్ చిత్రాల దర్శకుడు అంటూ సదరు మ్యాగజైన్ కొనియాడింది. అలాగే 500 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో ఆ ఇద్దరికీ చోటును కల్పించింది. పరిశ్రమేతరుల్లో ముఖేష్ అంబానీ కూడా ఇదే జాబితాలో ఉండడం అరుదైన దృశ్యం.
ఇక ఈ జాబితాలో పఠాన్ తో గ్రేట్ కంబ్యాక్ ని చాటుకున్న కింగ్ ఖాన్ షారూఖ్ కూడా ఉన్నారు. అగ్రనిర్మాత ఆదిత్య చోప్రా , సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ సహా ఏడుగురి పేర్లు 500మంది జాబితాలో ఉన్నాయి. వీరికి ఉన్న పాపులారిటీ గుర్తింపు గూగుల్ శోధన వంటి అంశాలతో వెరైటీ చాలా పరిశోధించాకే జాబితాలో చోటు కల్పించింది. 500 కోట్ల క్లబ్ చిత్రంతో స్ఫూర్తి నింపింది అంటూ యష్ రాజ్ ఫిలింస్ ని దాని అధిపతి ఆదిత్యా చోప్రాని వెరైటీ పొగిడేసింది. ఇక ఇదే జాబితాలో నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్ పేరును కూడా వెరైటీ ప్రస్థావించింది.
ముఖ్యంగా అంతర్జాతీయ ఎమ్మీలను గెలుచుకున్న ఏక్తా కపూర్ ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించగా, రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ వ్యవస్థాపకుడు శివాని పాండ్యా మల్హోత్రా, సోనీ పిక్చర్స్ సీఈఓ ఎన్‌పి సింగ్ పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. గుల్షన్ కుమార్ మరణించడంతో 19వయసులో వ్యాపారం ప్రారంభించి గొప్ప స్థాయికి ఎదిగిన టీసిరీస్ భూషణ్ కుమార్ కి ఈ జాబితాలో చోటు కల్పించింది.