Trump : ఇకపై అమెరికన్లకు స్వర్ణయుగమే: ట్రంప్

Trump

Trump

Trump : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ అమెరికా 50వ ఉపాధ్యక్షునిగా నియమితులు కానున్నారు. సాధారణ మెజార్టీకి కేవలం 3 ఎలక్టోరల్ ఓట్ల దూరంలోనే ట్రంప్ ఉన్నారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాల్లో గెలుపొందిన ఆయన, మరో 5 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్నికల్లో అనుకూల ఫలితాల నేపథ్యంలో ట్రంప్ ప్రసంగించారు. అమెరికా ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ మార్పు తమ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని అన్నారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతుందని, ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని కొనియాడారు. ఇది అమెరికన్లు గర్వించే విజయమని అన్నారు. తన మద్దతుదారులు చప్పట్లతో అభినందనలు తెలుపుతుండగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్ తో కలిసి ట్రంప్ వేదిక పైకి వచ్చి ప్రసంగించారు.

TAGS