China : నాటో సభ్య దేశాలు ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌లో సమావేశమయ్యాయి. నాటో 75వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రధానంగా చర్చకు వచ్చింది.. రెండేళ్లకు పైగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా రష్యా మాత్రం వాటిని లెక్కచేయకపోవడంతో పాటు మరింత బలపడుతోంది. అయితే ఆ దేశంపై పలు ఆంక్షలు విధించినా రష్యా మాత్రం తన ఆర్థిక పరిస్థితి చేజారకుండా చైనా కాపాడుతున్నది ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి. 32 దేశాలతో కూడిన నాటో సంస్థ ఇప్పుడు రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న స్నేహంపై ఆందోళన చెందుతుున్నది. నాటో, బుధవారం తన ప్రకటనలో, రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
“చైనా వైఖరి, ఒత్తిళ్లు తదితర విధానాలు మన ఆసక్తులు, భద్రత విలువలను సవాలు చేస్తున్నాయని నాటో పేర్కొంది. రష్యా -చైనాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం అంతర్జాతీయ క్రమాన్ని అణగదొక్కే ప్రయత్నాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నది. చైనా, రష్యా తో పాటు అనేక ఇతర సమూహాల నుండి హైబ్రిడ్, సైబర్, స్పేస్ ఇతర బెదిరింపులను ఎదుర్కొంటున్నామని నాటో తన డిక్లరేషన్‌లో ప్రకటించింది. చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలతో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఈ మూడు దేశాలు రష్యాకు ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక సాయం అందించాయి. ఇది నాటో సభ్య దేశాల్లో ఆందోళనను మరింత పెంచింది.
అయితే రష్యా దూకుడుకు తాము మద్దతిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను చైనా కొట్టిపారేస్తోంది. రష్యా- చైనా మధ్య సంబంధాలు చరిత్రలో అత్యుత్తమంగా ఉన్నాయి, చైనా ఇటీవలి కాలంలో రష్యాతో తన వాణిజ్య, సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసింది. యుద్ధానికి దోహదపడే యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్స్ , ఇతర వస్తువులను చైనా రష్యాకు సరఫరా చేసింది.
నాటోలోకి మరో రెండు దేశాలు
రష్యా హెచ్చరించినప్పటికీ, ఈ సంవత్సరం ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో భాగమయ్యాయి. ఫిన్‌లాండ్, స్వీడన్ సురక్షితమైనవని, కూటమిని మరింత బలోపేతం చేస్తుందని నాటో డిక్లరేషన్ పేర్కొంది. ఫిన్లాండ్ రష్యాతో సరిహద్దును పంచుకుంటుంది, ఫిన్లాండ్ లోపల నాటో దళాల మోహరింపు రష్యాకు ప్రత్యక్షంగా ముప్పు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి యూరో-అట్లాంటిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నాశనం చేసిందని, ప్రపంచ భద్రతను తీవ్రంగా బలహీనపరిచిందని నాటో గుర్తించింది. మిత్రదేశాలకు రష్యా పెద్ద ముప్పు అని పేర్కొంది.