Mangalagiri: రెండు రోజుల పోలీసు కస్టడీలోకి నందిగం సురేశ్
Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను ఆదివారం పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం జిల్లా జైలు నుంచి సురేశ్ ను అదుపులోకి తీసుకొని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరికి తీసుకు వచ్చారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఆయనను విచారించనున్నారు. ఈ నెల 17 మధ్యాహ్నం ఒంటి గంటలకు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరుతూ మంగళగిరి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే సురేశ్ ను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.