JAISW News Telugu

ACB Raids : రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ

ACB Raids

ACB Raids

ACB Raids : హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దాడులు చేసింది. మే 31వ తేదీ శుక్రవారం కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. వీరాస్వామి, ఎస్సై షఫిలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ల్యాండ్ కేసును క్లోజ్ చేయడానికి రూ. 3 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు.

ఈ క్రమంలో పోలీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులను పంపించి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు. ఆ వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుంటున్న సీఐ, ఎస్సై, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Exit mobile version