Aaradhya:ఆరాధ్య బ‌చ్చ‌న్ ఈవెంట్‌కి నాన‌మ్మ అత్తమ్మ‌ రాలేదేమి?

Aaradhya:ఐశ్వర్య రాయ్ బచ్చన్ – అభిషేక్ బచ్చన్ దంప‌తుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ త‌న‌ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో అద్భుత‌మైన స్టేజి పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఐష్‌- అభి జంట ఈ వేడుక‌ల‌కు హాజరై బ్రేక‌ప్ పుకార్లను కొట్టివేశారు. ఇదే వేడుక‌లో అమితాబ్ బచ్చన్ కూడా అగస్త్య నంద ఐష్‌లతో పాటు ఈ వేదికకు విచ్చేసి తన ఉనికిని చాటుకున్నారు. వారి న‌డుమ‌ అత్యంత ప్రేమ ఆప్యాయత క‌నిపించాయి.

ఐశ్వర్య- అభిషేక్ తమ 12 ఏళ్ల కుమార్తె అద్భుతమైన ప్రదర్శనను చూసి గర్వపడుతున్నామ‌ని అన్నారు. బిగ్ బి కూడా మనవరాలి నటనా నైపుణ్యాన్ని క‌నులారా వీక్షించి ఆనందించారు. అయితే బచ్చన్ కుటుంబం చిన్న ఆరాధ్యను అభినందించిన‌ ఇలాంటి అరుదైన వేడుక‌కు నాన‌మ్మ జయా బచ్చన్ .. అత్త‌మ్మ‌ శ్వేతా బచ్చన్ గైర్హాజరు కావడం నెటిజనుల్లో సందేహాల‌కు కార‌ణ‌మైంది.

చాలా మంది నెటిజన్లు కుటుంబ కలహాలకు జయ – శ్వేత ఇద్దరూ కారణమని నిర్ధారించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం హిందీలో ప్ర‌ముఖ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. ఐశ్వర్య బచ్చన్ ముంబైలోని త‌న‌ ఇంటి నుండి బయటకు వెళ్లిందని దీనికి ప్రధాన కారణం జయా బ‌చ్చ‌న్ తో స‌రిగా పొస‌గ‌క‌పోవ‌డ‌మేన‌ని ప్ర‌చార‌మైంది. శ్వేత బచ్చ‌న్ అమితాబ్ ఇంట్లోకి శాశ్వతంగా మారడం గొడవలను మరింత తీవ్రతరం చేసిందని కూడా క‌థ‌నాలు పేర్కొన్నాయి. అంత‌కుముందు నుంచి శ్వేతాతో ఐష్ కి ప‌డ‌క‌పోవ‌డం కూడా క‌ల‌త‌లు పెరిగేందుకు కార‌ణ‌మ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ఈ వార్తలన్నీ నిరాధారమైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే కోడ‌లు ఐశ్వర్య రాయ్‌తో తన కమ్యూనికేషన్ గురించి జయ బచ్చన్ మాట్లాడిన సందర్భం ఉంది. ఐష్ తో ఏదైనా ముఖాముఖిగా మాట్లాడ‌తాన‌ని జ‌యాబ‌చ్చ‌న్ తెలిపారు. మంచి, చెడు, అగ్లీ ఇలా ప్రతి అంశంపై ఆమెతో చాలా ఓపెన్‌గా ఉంటాన‌ని తెలిపారు. తన కోడలు ఐశ్వర్యతో తన మొహం మీద అన్నీ చెబుతానని, ఎప్పుడూ వెనుక వైపు నుంచి మాట్లాడనని జయాబచ్చన్ చెప్పారు.

శ్వేత గురించి మాట్లాడుతూ.. శ్వేతా ఐశ్వర్యరాయ్ విష‌యంలో విస్మయం చెందుతుంది. ఐష్‌ను శ్వేతా మెచ్చుకోవడం గురించి ప్రస్తావించారు జ‌యాబ‌చ్చ‌న్‌. ఐశ్వ‌ర్యారాయ్‌ను స్వీయ-నిర్మిత బలమైన మహిళ .. అద్భుతమైన తల్లి అని ప్ర‌శంసించారు. అయితే ఇప్పుడు ఆరాధ్య బ‌చ్చ‌న్ కీల‌క ఈవెంట్లో జయా బచ్చన్ – శ్వేతా బచ్చన్ లేకపోవడం గురించి నెటిజన్లు ప్రశ్నించడం కొంత విస్మ‌యించ‌ద‌గిన‌ది. జ‌యాజీ వ‌య‌సు రీత్యా విశ్రాంతి తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉండొచ్చు.. శ్వేతాకు రాలేని ప‌రిస్థితి ఏదైనా ఎదురై ఉండొచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు కొంద‌రు.

TAGS