Railway News: రైలు పట్టాలపై ఇనుప స్తంభం.. తప్పిన ప్రమాదం

Railway News: యూపీలోని పీలీభీత్-బరేలీ రైల్వే ట్రాక్ పై 25 అడుగుల 25 అడుగుల పొడవైన ఇనుప రాడ్ ను రైల్వే సిబ్బంది గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని పీలీభీత్ లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. పీలీభీత్-బరేలీ రైల్వేట్రాక్ పై 25 అడుగుల పొడవైన ఇనుప రాడ్ ను సిబ్బంది గుర్తించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారి ఆచూకీ కోసం రైల్వేట్రాక్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు.

ఈ ఘటనపై భారత రైల్వె స్పందిస్తూ గత ఏడాది జూన్ నుంచి ఈ తరహాలో 24 ఘటనలు జరిగాయని వెల్లడించింది. అందులో ఆగస్టులో 15, సెప్టెంబరులో ఇప్పటివరకు మూడుసార్లు ఇలాంటి పరిస్థితులు కనిపించాయని పేర్కొంది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్, తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణలో ఈ కుట్రపూరిత యత్నాలు బయటపడ్డాయని తెలిపింది.

TAGS