Indecent party : మొయినాబాద్ లో అర్ధరాత్రి అసభ్యకర పార్టీ.. పోలీసుల అదుపులో పలువురు

Indecent party
Indecent party : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో సోమవారం అర్ధరాత్రి అసభ్యకర పార్టీ ఘటన వెలుగుచూసింది. కొందరు యువతీ, యువకులు అందులో పాల్గొన్నట్లు రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న ఆరుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిన మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.
ముజ్రా పార్టీలో పాల్గొన్న నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఫామ్ హౌస్ లో వారంతా అసభ్యకర్ రీతిలో నృత్యాలు చేశారు. అర్ధనగ్నంగా చిందులేశారు. ఎస్ వోటీ పోలీసులు ఫామ్ హౌస్ లోకి వెళ్లే సరికే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దొరికినట్లు సమాచారం.