JAISW News Telugu

Dominic LeBlanc : హింసను రెచ్చగొడ్తామంటే ఊరుకోం – కెనడా మంత్రి డొమెనిక్ లె బ్లాంక్

Dominic LeBlanc

Dominic LeBlanc

Dominic LeBlanc : హింసను రెచ్చగొడ్తామంటే ఊరుకోమని కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి డొమెనిక్ లె బ్లాంక్ అన్నారు. ఖలిస్తానీ మద్ధతుదారులకు ఆయన గట్టి హెచ్చరిక చేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లను వాంకోవర్ లో అతికించడంతో ఆయన స్పందించారు. శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘వాంకోవర్ లో ఈ వారంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లను అతికించినట్టు రిపోర్టులు వెలువడ్డాయి. కెనడాలో హింసను రెచ్చగొడ్తామంటే ఊరుకోబోం’’ అని తెలిపారు.

ఈ సంఘటనపై భారత సంతతికి చెందిన చట్ట సభ్యుడు చంద్ర ఆర్య కూడా స్పందించారు. ‘‘ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లతో హిందూ-కెనడియన్లలో భయాన్ని కలిగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గురు పత్వంత్ సింగ్ కు చెందిన వేర్పాటు సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్, హిందువులను భారత్ కు వెళ్లిపోవాలని కొన్ని నెలల క్రితం వారిపై దాడి చేసింది. ఈ ఘటన దానికి కొనసాగింపు కిందకే వస్తుంది. ఆ పోస్టర్లలో ఇందిరా గాంధీ నుదుటిపై ఉన్న బొట్టును బట్టి కెనడాలోని హిందువులను వారు లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఈ ఘటనపై వెంటే చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

Exit mobile version