ACB : గేదెల ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వెటర్నరీ డాక్టర్
ACB Ride : గేదెల ఆరోగ్య ధ్రువీకరణ పత్రాల కోసం లంచం తీసుకుంటూ ఓ వెటర్నరీ డాక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా చింతపల్లిలోని పశువైద్యశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్ ఓ రైతుకు చెందిన 8 గేదెలకు ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి రూ.6,000 లంచం డిమాండ్ చేశాడు. పాలు అమ్ముకొని జీవనం సాగించే సదరు రైతు తనకు అంత ఆర్థిక స్తోమత లేదని మొరపెట్టుకున్నా ఆ డాక్టర్ కనికరించలేదు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా డాక్టర్ పాల్ జోసెఫ్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.