pensioners : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పింఛన్ దారులకు శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకు నెలకు ఒకసారి అందిస్తున్న పింఛన్ ను.. ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని ప్రకటించారు. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కని, ప్రభుత్వం దీనిని ఇంటి దగ్గరే గౌరవంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే మూడో నెల కలిపి తీసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం జెండా ఊపి గ్యాస్ పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్ అందజేసిన సీఎం. లబ్ధిదారు శాంతమ్మ నివాసంలో గ్యాస్ వెలిగించి స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసి మాట్లాడారు. మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చని ప్రకటించారు.