JAISW News Telugu

Ganja : బెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్థాలు సీజ్

Facebook
X
Linkedin
Whatsapp

Ganja seized : ఏపీలో గంజాయి కలకలం సృష్టించింది. విజయవాడ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సోమవారం (అక్టోబరు 7) పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. రూ.1.61 కోట్ల విలువైన 808 కిలోల మత్తు పదార్థాలను అధికారులు సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే విజయవాడలో ఇటీవల గంజాయి పట్టివేత కేసులు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ల పరిధిలో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 90.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ బైక్ సీజ్ చేశారు.

Exit mobile version