Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మరోసారి షాక్ తగిలింది. మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే సోమవారంతో ఆయన రిమాండ్ గడువు ముగియడంతో ఆయనను మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం కోర్టు అతనికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
కాగా, 2020 డిసెంబరులో వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నందిగం సురేష్ 78వ నిందితుడిగా ఉన్నారు. ఇందులో నాటి ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ను పోలీసులు మొదట రెండు రోజుల పాటు విచారణ కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత 14 రోజుల పాటు నవంబరు 4 వరకు రిమాండ్ విధించారు. తాజాగా మరో 14 రోజులు అంటే ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు.