Electric Shock : హైదరాబాద్ శివారు జల్ పల్లి లోని ఫాంహౌస్ కు వచ్చిన పలువురు స్విమ్మింగ్ పూల్ లోకి దిగి కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్ పల్లిలోని ఫాంహౌస్ కు వచ్చారు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.
వీరిలో పూల్ మధ్యలో ఉన్నపర్వేజ్ (19), ఇంతియాజ్ (22)లు రెండు నిమిషాల పాటు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.