Kalyan Jewellers Dussehra Celebrations : మహిషాసుర మర్ధని అయిన అమ్మవారిని సెలబ్రెటీలు ఘనంగా కొలిచారు. దసరా పండుగ సందర్భంగా కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమం కు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో సెలబ్రెటీలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొని పులకించి పోయారు. కళ్యాన్ జ్యువెల్లర్ అధినేత ఇంట్లో జరిగిన ఈ వేడుక గురించి తెలుసుకుందాం.
భారత్ లో అతిపెద్ద నగల దుకాణం ‘కళ్యాణ్ జ్యువెల్లర్స్’. మొదట ఒక్క షాపుగా 1993లో స్థాపించబడింది. కేరళ రాష్ట్రం, త్రివేండ్రం కు చెందిన టీఎస్ కళ్యాణ రామణ్ తన పేరుతో కళ్యాణ్ జ్యువెల్లర్స్ ను స్థాపించాడు. 2021లో అది దేశం దాటి ప్రపంచ వ్యాప్తంగా కూడా సేవలందిస్తుంది. టీఎస్ కళ్యాణ్ రామన్ ప్రస్తుతం ఎండీ, చైర్మన్ గా ఉండగా.. సంజయ్ రఘురామణ్ సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు.
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామన్ పూజలు, దైవిక కార్యక్రమాలను ఎక్కువగా చేస్తారు. ఇందులో భాగంగా దసరా వేడుకలను ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ సంగీత విభావరితో పాటు సెలబ్రెటీలను ఆహ్వానించారు. అక్టోబర్ 24వ తేదీ అమ్మవారిని కొలిచి విశేష పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమానికి తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్లు అయిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, కత్రినా కైఫ్, రష్మిక మందన ఇలా చాలా మంది హాజరయ్యారు.