JAISW News Telugu

America : ఆదివారం కూతురు.. సోమవారం తల్లి.. యూఎస్ లో యాక్సిడెంట్ ఇండియాలో విషాదం.. 

America

America

America : ఉద్యోగం కోసం అగ్ర దేశం అమెరికా వెళ్లిన జంటకు కన్నీరే మిగిలింది. యాక్సిడెంట్ లో గాయాలపాలైన భార్య మరణించడంతో భర్త ఒంటరివాడయ్యాడు. ఎన్నో కలలు కంటూ భర్తతో అమెరికా వెళ్లిన యువతి మృతదేహంగా ఇండియాకు తిరిగి వస్తుండడంతో కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు. జీవిత భాగస్వామితో ఎంతో లైఫ్ ను ఊహించుకున్న ఆ భర్త సైతం ఆవేదన చెందుతున్నాడు.

యూఎస్ లోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొణకంచికి చెందిన కమతం గీతాంజలి (32) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమె భర్త నరేశ్ వివరాలను ఇండియాలోని గీతాంజలి కుటుంబ సభ్యులకు తెలిపాడు. నరేశ్ తన భార్య, పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో గీతాంజలి-నరేశ్ కుమార్తె హానిక స్పాట్ లోనే మరణించింది.

గీతాంజలి తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటా హుటిన స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ఆదివారం నుంచి ఆమెకు చికిత్స అందిస్తుండగా సోమవారం మరణించింది. ఈ ఘటనలో నరేష్‌ తో పాటు కుమారుడు బ్రమణ్‌కు కూడా గాయాలవగా ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కుమార్తె, తల్లి మరణంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను కొణకంచికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

Exit mobile version