First female astronaut : మహిళా వ్యోమగామి అంతరిక్షంలోకి.. తొలిసారి పంపిన చైనా
first female astronaut : చైనా తొలిసారి ఓ మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన సీఎంఎస్ఏ వెల్లడించింది. తాజాగా గన్స్ ప్రావిన్స్ లోని జియూక్వియాన్ స్పేస్ సెంటర్ నుంచి షెంఝూ-19 మిషన్ లో భాగంగా నేడు ముగ్గురు యువ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ కు తరలించింది. అందుకోసం లాంగ్ మార్చ్-2ఎఫ్ అనే భారీ రాకెట్ ను వాడారు. వ్యోమగాముల్లో 34 ఏళ్ల స్పేస్ ఫ్లైట్ ఇంజనీర్ వాంగ్ హవుజె కూడా ఉన్నారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించిన వారు స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. వీరు ప్రయాణించిన స్పేస్ షిప్ అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్ తియాన్హేతో అనుసంధానమైంది.
ఈ ముగ్గురు వ్యోమగాములు ఆరు నెలల పాటు అక్కడే ఉండి వివిధ ప్రయోగాలను, స్పేస్ వాక్ ను నిర్వహిస్తారు. దీనినుంచి వచ్చిన అనుభవంతో 2030 నాటికి చంద్రుడి పైకి యాత్రను చేపడతారు. ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) ప్రకటించింది.