CCTV footage : సీసీ టీవీ ఫుటేజీ లీకేజీ వ్యవహారంలో టెక్నీషియన్, విలేకరిపై కేసు

Borugadda Anil
CCTV footage Leaking Case : గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన ఘటనలో సీసీటీవీ ఫుటేజీ లీకేజీ వ్యవహారంలో ఓ టెక్నీషియన్ తో పాటు ఓ దినపత్రిక విలేకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ ఖైదీ అనిల్ కుమార్ కు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో బల్లపై దిండు, దుప్పటి సమకూర్చి పడుకోబెట్టడం, రౌడీషీటర్ కుర్చీలో కూర్చొని, పోలీసులతో గట్టిగా మాట్లాడిన సీసీ కెమెరా ఫుటేజీని అరండల్ పేటకు చెందిన టెక్నీషియన్ శేషగిరిరావు అలియాస్ శేషు ఓ దినపత్రిక విలేకరి అరుణ్ కుమార్ కు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ లు కేసు నమాదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఎస్సై కృష్ణబాజి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.