Andhra Pradesh: గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిపై కేసు

Andhra Pradesh: వైసీపీ నేత, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ, జనసేన నేతలు గుంటూరులోని అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మనోహర్ నాయుడు నిరసన తెలుపుతున్న ప్రాంతానికి వెళ్లి పోలీసుల చేతిలోని లాఠీ తీసుకొని జనసేన నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. చంద్రబాబు, పవన్ లను దూషించారు. దీనిపై టీడీపీ, జనసేన నేతలు అప్పుడు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కావటి మనోహర్ నాయుడు, పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

TAGS