JAISW News Telugu

Amazon : భారీ షాక్ ఇచ్చిన అమెజాన్.. వేల పోస్టులు హుష్ కాకి..

Amazon

Amazon

Amazon : ప్రపంచం ఇంకా మాంద్యం దెబ్బల నుంచి కోలు కోవడం లేదు. అప్పుడు కరోనా కష్టపెడితే ఇప్పుడు యుద్ధాలు ఆ కష్టాలకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు వందలాది, వేలాది ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇక చిన్న కంపెనీలు అయితే తాళం వేయాల్సిందే. అప్పట్లో ట్విటర్ (ఇంకా ఎక్స్ కాక ముందు)ను ఎలన్ మాస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత ప్రతీ రోజు తొలగింపు గురించే వార్తలు వచ్చేవి. వీటిని చూస్తూ వేలాది మంది ఆందోళన చెందే వారు. లక్షలాది రూపాయలు జీతం తీసుకునే వారు సైతం వేలల్లో జీతం ఇచ్చినా పని చేస్తాం అంటూ చెప్పడం చూస్తే కన్నీళ్లు ఆగవేమో. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదిక తెచ్చింది. దీని ప్రకారం, అమెజాన్ సుమారు 14,000 మంది మేనేజర్‌లను తొలగించాలని ఆలోచిస్తోందట. దీని వల్ల వార్షికంగా సుమారు $3 బిలియన్ల ఆదా అవుతుందని కంపెనీ భావిస్తోందట. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ ఈ చర్యలు తీసుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది. తొలగింపులు వివిధ విభాగాలపై ప్రభావం చూపుతాయి. ఆర్థిక సవాళ్లను నావిగేట్ చేయడం, రిటైల్ రంగంలో పోటీ పెంచడం వల్ల అమెజాన్ సామర్థ్యం, లాభదాయకతపై దృష్టి పెడుతుంది.

Exit mobile version