Alia Bhat:బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్-అలియాభట్ తమ కుమార్తె రాహాను ఎట్టకేలకు కెమెరా ముందుకుమ తీసుకొచ్చారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా తమ ఇంటి వద్దకు వచ్చిన విలేకర్లను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు రాహా క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
చాలా కాలంగా స్నేహితులుగా ఉన్న రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలి సారి కలిసి అయాన్ ముఖర్జీ రూపొందించిన `బ్రహ్మాస్త్ర` కోసం వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మాకరింది. ఇరుకుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు అంగీకరించడంతో గత ఏడాది ఏప్రిల్ 14న వీరి వివాహం జరిగింది. ఆ వెంటనే గుడ్ న్యూస్ చెప్పిన అలియా దంపతులకు నవంబర్‌లో వీరికి పాప జన్మించింది.
తమ పాపకు రాహా అనే పేరు పెట్టామంటూ అలియా గతంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. వివిధ భాషల్లో ఆ పేరుకున్న అర్థమేంటో తెలిపారు. రాహా అంటే దైవ మార్గమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని చెప్పారు. రణ్‌బీర్ ఆ పేరుని నిర్ణయించారని అలియా తెలిపారు. పాప రాకతో తమ జీవితం ఆనందంగా మారిందని పలు సందర్భాల్లో ఈ జంట పేర్కొంది. ఇదిలా ఉంటే ఇటీవల రణ్‌బీర్ కపూర్ `యానిమల్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.