Mahabubabad: రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో రైల్వే అధికారులు ఈరోజు (సోమవారం) ఉదయం 96 రైళ్లను రద్దు చేశారు. వరద కారణంగా నిన్న రాత్రి రైల్వే అధికారులు 142 రైళ్లను దారి మళ్లించారు. 177 రైళ్లను రద్దు చేశారు.
భారీ వర్షాలతో దెబ్బతిన్న ట్రాక్ లను పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. రైల్వే ట్రాక్ ల మరమ్మతు కోసం వెయ్యి మంది సిబ్బందిని దెబ్బతిన్న ప్రాంతాలకు తరలించింది. ట్రాక్ ల పునరుద్ధరణ పనులు రెండు రోజులు పట్టే అవకాశం ఉండగా, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.