Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటు వెలికితీత

Prakasam Barrage
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బూటును ఇంజనీర్లు తొలగించారు. గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజనీర్లు, అధికారులు శత విధాలుగా ప్రయత్నించి వెలికితీశారు. 40 టన్నుల బరువు ఉన్న ఈ పడవ బ్యారేజీ 69వ గేట్ వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజనీర్లు పున్నమి ఘాట్ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బెకెం ఇన్ ఫ్రా సంస్థ ఇంజనీర్లు, అధికారులు ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడిన 3 భారీ పడవలను వెలికితీశారు.
ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బూట్లు బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బూట్లు, ఒక పడవ గేట్ల వద్ద ఇరుక్కుపోయాయి. ఇవి బ్యారేజి గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పనులు ప్రారంభించిన అధికారులు రెండు పడవలను ఇదివరకే బయటకు తీశారు. తాజాగా ఈరోజు మూడో బూటును వెలికితీసి విజయం సాధించారు.