Pregnant woman : ఆస్పత్రిలో గర్భిణికి తప్పిన ప్రమాదం
![Pregnant woman](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/09/18145116/P-10-4.jpg)
Pregnant woman, Hospital
pregnant woman : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో ఓ గర్భిణికి పెను ప్రమాదం తప్పింది. ఓ గర్భిణికి సర్జరీ ద్వారా కాన్పు చేసేందుకు టేబుల్ పై పడుకోబెట్టి ఫోకస్ లైటును ఆమె వైపు తిప్పుతుండగా అది ఊడి పడింది. వెంటనే అది గర్భిణిపై పడకుండా థియేటర్ అసిస్టెంట్ గోవింద్ వెంటనే భుజం అడ్డుపెట్టడంతో రెండో వైపున ఉన్న గైనకాలజిస్టు ధనలక్ష్మి, స్టాఫ్ నర్సు వరలక్ష్మిపై అది పడింది. దాంతో స్టాఫ్ నర్సు భుజానికి తీవ్ర గాయమైంది. గైనకాలజిస్టు, థియేటర్ అసిస్టెంట్ కు స్వల్ప గాయాలయ్యాయి. సిబ్బంది అప్రమత్తతతో గర్భిణికి, కడుపులో బిడ్డకు ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.