Ganja chocolates : గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్టు
Ganja chocolates : గంజాయి చాక్లెట్లు తయారుచేసి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి చాక్లెట్లను గుర్తించడం కష్టం కాబట్టి నిందితులు చాలా తేలిగ్గా వీటిని విక్రయిస్తున్నారని సీపీ సుధీర్ బాబు చెప్పారు. సంతోష్, బీరేందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడినవారు బీహార్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
మరో ఘటనలో ఆదిభట్ల ప్రాంతంలో హాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామి రాచకొండ పోలీసులు వెల్లడించారు.